© 2026 nimisham.in

ఇల్లెందు, సెప్టెంబర్ 02 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సామాన్యులకు సంక్షేమం దూరమైందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా ఇల్లెందులో 420 అడుగుల భారీ ప్లెక్సీతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఇల్లెందు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పరిపాలనపై రాష్ట్రంలో వారు చేస్తున్న వికృత చేష్టలను ప్రజలకు వివరించేలా 420 అడుగుల ఫ్లెక్సీతో భారీ ర్యాలీతో జెకె బస్టాండ్ సెంటర్ నుండి జగదాంబ సెంటర్, పాత బస్టాండ్, బుగ్గ వాగు మీదుగా కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హరిప్రియ నాయక్ మాట్లాడుతూ... యువ నేత కేటీఆర్ పిలుపుమేరకు వారం రోజుల పాటు నిర్వహించబోయే సమరభేరి కార్యక్రమాలలో భాగంగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో ప్రదర్శన కార్యక్రమం నిర్వహించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉంది అంటే బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో తెచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఒకటి ఒకటిగా తొలగిస్తూ పేద, మధ్య తరగతి కుటుంబాలను ఇబ్బందులు పాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఇల్లెందు ఎమ్మెల్యే ఇల్లెందులో చేసిన అభివృద్ధి ఏమి లేదని ఆమె అన్నారు. మహబూబాబాద్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ బిందు మాట్లాడుతూ.. కేసీఆర్ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసియటమే పనిగా ముందుకు సాగుతుంది. రైతు బీమా డబ్బులు ప్రీమియం కట్టక రైతు బీమా పథకం ఆగిపోతుందని రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుకు చెందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బానోత్ హరి సింగ్ నాయక్, మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సిలివేరి సత్యనారాయణ, దాస్యం ప్రమోద్, జెకె శీను,లకావత్ దేవీలాల్, మాజీ వార్డు కౌన్సిలర్లు కటకం పద్మావతి, వివిధ మండలాల నాయకులు తాతా గణేష్, శీలంశెట్టి రమేశ్, ఏ.అచ్చయ్య, బోడ బాలు, బానోత్ కిషన్, ధరావత్ బాలాజీ, గిన్నారపు రాజేష్, కాసాని హరిప్రసాద్, హరికృష్ణ, నీలం రాజశేఖర్, ఆమెడ రేణుక, కొక్కు సరిత, నెమలి ధనలక్ష్మి పాల్గొన్నారు.
[caption id="attachment_2500702" align="alignnone" width="1200"] కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు సంక్షేమం దూరం : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్[/caption]