© 2026 nimisham.in

విజయనగరం రూరల్: వినియోగదారుల హక్కులను పరిరక్షించడంలో అధికారులు పూర్తి బాధ్యతతో, సమన్వయంతో పనిచేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్. సేదు మాధవన్ ఆదేశించారు. వినియోగదారు
ల పరిరక్షణ చట్టం–2019ను పటిష్టంగా అమలు చేస్తూ, ప్రజలకు నాణ్యమైన వస్తువులు, సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బుధవారం జిల్లా వినియోగదారుల పరిరక్షణ మండలి సమీక్షా సమావేశంలో ఆయన వివిధ శాఖల అధికారులతో వినియోగదారుల సమస్యలు, వాటి పరిష్కారంపై జాయింట్ కలక్టరు చాంబరులో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. మార్కెట్లో వస్తువుల నాణ్యత, తూకాలు–కొలతలు, ధరలు, ఆహార పదార్థాల స్వచ్ఛత, ప్రజా రవాణా, విద్యుత్, టెలికాం, మున్సిపల్ సేవలు తదితర అంశాల్లో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.