© 2026 nimisham.in

ముంబయి: మహారాష్ట్ర ఓటర్ల ముసాయిదా జాబితాను అక్కడి ప్రధాన ఎన్నికల అధికారి మంగళవారం విడుదల చేశారు. గత ఓటర్ల జాబితాలో ఉన్న 2.06 కోట్ల మంది పేర్లను తొలగించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియకు ముందు రాష్ట్రంలో మొత్తం 9,78,54,049 మంది ఓటర్లు ఉండగా, కొత్త ముసాయిదా జాబితాలో 7,71,65,562 మంది మాత్రమే ఉన్నారు. అత్యధికంగా పాల్ఘర్ జిల్లాలోని నలసోపారా నియోజకవర్గంలో 3,06,851 ఓట్లను తొలగించారు. తర్వాత పుణెలోని హడప్సర్ 2,98,372 తొలగింపులతో రెండో స్థానంలో ఉంది. రాయ్‌గఢ్‌లోని పన్వేల్ 2,83,356, పుణెలోని ఖడక్వాస్లా 2,77,851, చించ్వాడ్ 2,69,733 పేర్ల తొలగింపుతో తర్వాతి వరుస స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు తక్కువగా అహ్మద్‌నగర్ జిల్లాలోని అకోలా (ఎస్టీ)లో 16,430 ఓట్లు తొలగించారు. వీరిని.. ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదు అయినవారు, మరణించినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ఆచూకీ లభించనివారు/గైర్హాజరైనవారు, ఇతరులుగా అధికారులు గుర్తించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.