© 2026 nimisham.in

అయోధ్య రామ మందిరం పరిపాలనకు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రాను నియమించే అవకాశం ఉంది. 5 వేల మందికి పైగా దరఖాస్తుదారు
ల నుంచి ఆయన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారత వైమానిక దళంలో పలు కీలక కమాండ్ బాధ్యతలు నిర్వహించిన జీతేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో వెస్ట్రన్ కమాండ్ చీఫ్‌గా పనిచేశారు.శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బుధవారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో 12 అంశాలపై చర్చించనున్నారు. ఇందులో రామ మందిరానికి తొలి సీఈఓ నియామకం ప్రధాన అంశంగా ఉంది. సీఈఓకు విస్తృత పరిపాలనా అధికారాలు కల్పించేలా ట్రస్ట్ డీడ్‌లో మార్పులు చేయాలని కూడా నిర్ణయించే అవకాశం ఉంది.2020 ఫిబ్రవరి 5న ట్రస్ట్ ఏర్పాటైన తర్వాత డీడ్‌లో మార్పులు చేయడం ఇదే తొలిసారి కానుంది. మందిరంలో విరాళాల అక్రమాల ఆరోపణలు, సమర్పణల నగదు మాయం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ నిర్వహిస్తున్న మూడో సమావేశం ఇది. ఈ వ్యవహారం నేపథ్యంలో ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా చేశారు.మందిరం పరిపాలనను మరింత ప్రొఫెషనల్‌గా, పారదర్శకంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి సీఈఓ అవసరమని రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా గతంలో పేర్కొన్నారు. సీఈఓ ప్రభుత్వ జోక్యం లేకుండా పనిచేస్తారని, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారని సమాచారం.సీఈఓకు చట్టపరమైన, పరిపాలనా, ఆర్థిక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సంస్థకు అవసరమైన విధానాలు,