© 2026 nimisham.in

ఏ కాలమైనా జిడ్డు చర్మంతో బాధపడే అమ్మాయిలు చాలామందే ఉంటారు. అయితే ఈ చర్మతత్వం మొటిమలు, మచ్చలకు కారణమవుతుంది. అందుకే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
⚛ పాలను ముఖానికి అప్లై చేసుకొని పావుగంటయ్యాక కడిగేసుకోవాలి. తద్వారా చర్మంపై జిడ్డుదనం తొలగుతుందట.
⚛ తేనెతోనూ ముఖంపై జిడ్డుదనాన్ని తొలగించచ్చు. ఇందుకోసం తేనెను ముఖానికి పూతలా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
⚛ గుడ్డులోని తెల్లసొన, ద్రాక్షరసం, నిమ్మరసం.. ఈ మూడింటినీ కొద్ది మొత్తాల్లో తీసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూసుకొని పావుగంట తర్వాత కడిగేసుకోవాలి. నిమ్మరసం సహజసిద్ధమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది, గుడ్డులోని తెల్లసొన చర్మం బిగుతుగా మారడానికి, ద్రాక్షరసం చర్మం మృదువుగా మారడానికి ఉపకరిస్తాయట.
⚛ సాధారణంగా ఆయిలీ స్కిన్ ఉన్న వారు ఎక్కువసార్లు ముఖం కడుక్కుంటూ ఉంటారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఈ క్రమంలో పదే పదే సోప్ లేదా ఫేస్‌వాష్ వాడితే.. వాటిలో ఉండే రసాయనాలు చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. కాబట్టి సాధారణ నీటితో రోజుకు రెండు లేదా మూడుసార్లు ముఖం శుభ్రం చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.