© 2026 nimisham.in

ఏపీలో అన్ని నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): ఏపీలో అన్ని నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసి సీఎం జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఉత్తరాంధ్రకు గోదారమ్మను తీసుకువచ్చామని తెలిపారు. నదులు, వాగులు, వంకలు దాటుకుని గోదారమ్మ వచ్చిందని ప్రస్తావించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణమ్మను తరలించి.. కరువు పీడిత మార్కాపురానికి నీళ్లిచ్చామని ఉద్ఘాటించారు. నల్లమల కొండలను చీల్చుకుని కృష్ణమ్మ వచ్చిందని అన్నారు. ఎన్నో సమస్యలను అధిగమించి గోదావరి జలాలు తీసుకువచ్చామని తెలిపారు.
పోలవరం ఎడమ కాలువ కోసం రూ.4 వేల కోట్ల ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా మారేలా చేస్తామని తెలిపారు. ఈ జల విజయం.. ప్రజల విజయమని చెప్పుకొచ్చారు. ఆధునిక దేవాలయాలు.. సాగునీటి ప్రాజెక్టులు అని అభివర్ణించారు. నీరు ఉంటేనే భద్రత, భవిష్యత్తుపై ఓ భరోసా కల్పిస్తుందని తెలిపారు. నీరు ఉంటేనే పరిశ్రమలు.. తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని వివరించారు. 2014లో తాము అధికారంలోకి వచ్చాక పోలవరంపై దృష్టిపెట్టామని అన్నారు. 2019 నాటికి 72 శాతం పోలవరం పనులు పూర్తిచేశామని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం.. పోలవరాన్ని పర్యవేక్షించేలా మార్చామని వెల్లడించారు. 2019లో గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చిందని.. పోలవరానికి శాపమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని ధ్వజమెత్తారు.
పోలవరం నిర్వాసితులకు గొడ్డలి పార్టీ పైసా కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరానికి శాపవిముక్త కలిగిందని వ్యాఖ్యానించారు. 2028 నాటికి మొత్తం 12 ప్రాజెక్టులు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వచ్చాయని ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్రకు ఎన్నో పరిశ్రమలు తీసుకువస్తున్నామని వివరించారు. ఉత్తరాంధ్రకు కంపెనీలు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి అసూయగా ఉందని దుయ్యబట్టారు. భవిష్యత్తులో ఉత్తరాంధ్రకే వలసలు వస్తారని అన్నారు. ఇకపై ఉత్తరాంధ్ర.. ఉత్తమ ఆంధ్రగా మారుతుందని నొక్కిచెప్పారు. పారిశ్రామికంగా అనకాపల్లి అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా అభివృద్ధి చేస్తామని అభిప్రాయపడ్డారు. వైసీపీ హయాంలో ఉత్తరాంధ్ర వణికిపోయిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
గొడ్డలి పార్టీ హయాంలో ఎక్కడచూసినా అరాచకాలే..
గొడ్డలి పార్టీ హయాంలో ఎక్కడచూసినా అరాచకాలేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఉత్తరంధ్ర ప్రాజెక్ట్‌లకు రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు.. కానీ ఆ నాయకుడి విలాసాలకు రుషికొండపై రూ.500 కోట్లతో భవనం కట్టారని ధ్వజమెత్తారు. మూడు రాజధానులు అంటూ మాయమాటలు చెప్పారని ఆగ్రహించారు. ఇప్పుడు మావిగన్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. విధ్వంసమే వైసీపీ విధానమని ఎద్దేవా చేశారు. గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోందని ధ్వజమెత్తారు. తాము పోలవరం పూర్తిచేస్తే.. తామే కట్టామంటారేమో? అని వ్యంగ్యంగా మాట్లాడారు. అమరావతి నిర్మాణం పూర్తయితే.. తమ ఘనతే అంటారేమో? అని ఎద్దేవా చేశారు. వైసీపీ ఫేక్ రాజకీయం అలాగే ఉంటుందని సీఎం చంద్రబాబు సెటైర్లు గుప్పించారు.
పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్
సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్
ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం
Read Latest AP News And Telangana News And National News