© 2026 nimisham.in

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Meat shops closed in Hyderabad city on September 4: ప్రస్తుతం మనం శ్రావణ మాసంలో ఉన్నాం. ఈనెలలో ప్రతి రోజు ఏదో ఒక పండగను మనం జరుపుకుంటాం. అయితే.. సెప్టెంబర్ 4న మనం జన్మాష్టమిని భక్తి శ్రద్దలతో జరుపుకుంటాం. శ్రీకృష్ణ జన్మాష్టమి హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ఈ రోజున చాలా మంది ఉపవాసాలు ఉంటారు. విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తారు. పలు చోట్ల దహి హండీ ఉట్టి కొట్టే వేడుకను నిర్వహిస్తారు. తమ పిల్లలకు చిన్నారి శ్రీకృష్ణుడు, రాధలా కాస్ట్యూమ్ లు వేసి పొంగిపోతారు.
శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించాడనే విశ్వాసంతో రాత్రి వేళ పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు అష్టమి, రోహిణి తిథి ఉండేలా చూసుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 4, శుక్రవారం రోజునే జన్మాష్టమి వేడుకలు నిర్వహించాలని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ పరిధిలో కూడా జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4న చికెన్, మటన్ అమ్మకాలపై ఒక రోజు నిషేధం విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Read more: Konda Surekha: నన్ను ఎవరు పిలువలేదు.. నేనే వచ్చా... ఉత్కంఠ వేళ కొండంత ట్విస్ట్ ఇచ్చిన మంత్రి సురేఖ..!
ఈ మేరకు రిటైల్, చికెన్, మటన్ షాపులు, పశువధ శాలలన్ని మూసి వేసి ఉంచాలని అధికారులు తెల్చి చెప్పారు. ఎవరైన రహస్యంగా మాంసం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా జన్మాష్టమి రోజున ప్రత్యేకంగా తనిఖీలు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ వాసులు ఈవిషయాన్ని గమనించాలని జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో కోరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.