© 2026 nimisham.in
బాదం గింజల్లో విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచి చదివింది బాగా గుర్తుండేందుకు సహాయపడతాయి.
మెదడు ఆకారాన్ని పోలి ఉండే వాల్నట్స్ జ్ఞాపకశక్తిని పెంచేందుకు సహాయపడతాయి. పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారు ఈ వాల్నట్స్ తింటే చదివింది బాగా గుర్తు ఉంటుంది.
నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి నరాల పనితీరును బాగుచేస్తాయి. మెదడును చురుకుగా ఉంచి చదివింది బాగా గుర్తుండేందుకు సహాయపడతాయి. అయితే మితంగా తీసుకోవడం మంచిది.
పల్లీల్లో నియాసిన్, రెస్వెరట్రాల్, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బెల్లంలో ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ రెండింటితో తయారుచేసే చిక్కీలు తినడం ద్వారా జ్ఞాపకశక్తి బాగుంటుంది.
పాలకూర, తోటకూర, మునగాకు, మెంతి ఆకులు వంటి ఆకుకూరల్లో మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ కె వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
మఖానాలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. నెయ్యిలో తేలికగా వేయించిన ఈ మఖానా స్నాక్ రూపంలో తీసుకుంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది.
ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి మెదడు కణాలను రక్షిస్తుంది. అందుకే ఉసిరిని డైట్లో చేర్చుకోవడం ద్వారా జ్ఞాపశక్తి బాగుంటుంది.
నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరు చురుకుగా ఉంచేందుకు సహాయపడతాయి. తద్వారా చదివింది బాగా గుర్తుంటుంది.
రాగాలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు లాంటి చిరు ధాన్యాల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మీ శక్తిని ఎక్కువసేపు తగ్గకుండా కాపాడి మెదడును చురుకుగా ఉంచుతాయి.