
అమెరికా నేవీ షిప్ రాకతో థాయిలాండ్ లో సెక్స్ వర్కర్లు అరెస్ట్.. ఎందుకో తెలుసా
అమెరికా నావికాదళానికి చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధనౌక దాదాపు 286 రోజులు సముద్రంలో గడిపిన తర్వాత తొలిసారిగా థాయిలాండ్ లోని పటాయా పోర్టుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. పటాయా నగరం వ్యాప్తంగా వ్యభిచార నెట్ వర్క్ లు, సెక్స్ వర్కర్లపై పోలీసులు పెద్దఎత్తున దాడులు నిర్వహించి ఉక్కుపాదం మోపుతున్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ కు వ్యతిరేకంగా చేపట్టిన సైనిక ఆపరేషన్లకు మద్దతుగా దాదాపు 286 రోజుల పాటు సముద్రంలోనే గడిపిన ఈ భారీ యుద్ధనౌక బుధవారం ఉదయం థాయిలాండ్ లోని లామ్ చబాంగ్ పోర్టుకు చేరుకుంది. సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు సుమారు 5,000 మంది యూఎస్ నావికులు, మెరైన్లు, పైలట్లు పటాయా తీరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో వారాంతంలో సెక్స్ ట్రేడ్ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రాస్టిట్యూట్ సెంటర్లపై దాడులు చేపట్టి 40 నుంచి 50 మంది సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు.థాయిలాండ్ లో వ్యభిచారం ఇల్లీగల్.. అయినా సెక్స్ ట్రేడ్ ను పూర్తిగా అడ్డుకోవడం సవాలుతో కూడుకున్న వ్యవహారమేనని అక్కడి పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో అక్రమ కార్యకలాపాలను నియంత్రించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ఇక ప్రస్తుతం పటాయా బీచ్ రిసార్టు సమీపంలో ఆ నౌకను ఉంచారు. ఇక్కడే అమెరికా నేవికులు సేద తీరనున్నారు. ఇక్కడ నైట్ లైఫ్, సెక్స్ టూరిజంకు కేంద్రమైన పటాయాలో యుద్ధనౌకను డాక్ చేయడంతో సిటీలోని బార్లు, రెస్టారెంట్లు ఇప్పుడు బిజీ కానున్నాయి. గతంలో వియత్నాం యుద్దం సమయంలోనూ ఇక్కడ దాదాపు 50 వేల మంది సైనికులతో కూడిన యుద్ధ నౌకను డాక్ చేశారు. ఇప్పుడు ఆ సంఖ్య తక్కువే .. ఇక అమెరికా నావికుల రాకతో పటాయాలో మళ్లీ టూరిజం ఊపందుకుంది. ఇన్నిరోజులూ ఇరాన్- అమెరికా యుద్ధ ప్రభావం ఈ సిటీపై పడింది. టూరిజం తగ్గింది.ఈ క్రమంలో అమెరికా నావికులు ఇక్కడ